ట్రంప్‌కు ప్రజాదరణ పెరగడం ప్రమాదకరం: సర్కోజి | Rise of Donald Trump 'scary', France's Nicolas Sarkozy | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ప్రజాదరణ పెరగడం ప్రమాదకరం: సర్కోజి

Mar 25 2016 9:06 AM | Updated on Aug 25 2018 7:50 PM

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ప్రజాదరణ పెరగడం ప్రమాదకరమని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజి అన్నారు.

లండన్ : అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ప్రజాదరణ పెరగడం ప్రమాదకరమని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజి అన్నారు. లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, అమెరికా పరిస్థితిని తలచుకుని తాను భయకంపితుడనయ్యానని పేర్కొన్నాను. తన ప్రచారంలో జనాకర్షక, మొరటు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ట్రంప్‌పై సర్కోజి విమర్శించారు.

ముస్లింల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ట్రంప్ అభ్యర్థిత్వం కోసం రియల్ ఎస్టేట్‌దారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే, 2017లో ఫ్రాన్స్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై సర్కోజి మరోసారి కన్ను వేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రంప్ ప్రచారతీరుతెన్నులపై వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement