జావా సముద్రంలో ఎయిర్ ఆసియా విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇండోనేషియా: జావా సముద్రంలో ఎయిర్ ఆసియా విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదో రోజు రెస్క్యూ టీమ్స్ సముద్రంలో మృతిదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీసిన సంగతి తెలిసిందే.
బుధవారం గాలింపు చర్యలకు ప్రతికూల వాతావరణం వల్ల తీవ్ర ఆటంకం కలిగింది. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల కారణంగా గాలింపు పరిమితంగా కొనసాగింది. బలమైన అలల వల్ల శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి.