డిసెంబర్ 31 అనగానే నూతన సంవత్సర వేడుకలు గుర్తొస్తాయి. ఆ వేడుకలను ఒక్కొక్కరు ఒక్కో రీతిలో జరుపుకొంటారు. ఇక మందు బాబుల గురించి చెప్పక్కర్లేదు.. అయితే న్యూజిలాండ్‌లోని కోరమాండల్ ద్వీపకల్పంలో మద్యంపై పూర్తిగా నిషేధం ఉంది. అక్కడ కూడా మన దగ్గరి లాగే పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించారు.. ఎవరూ తాగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు.
అయితే కొందరు మందు బాబులు ఏం చేశారో తెలుసా...? సముద్ర జలాల్లో నీరు తక్కువగా ఉన్న చోట ఇసుకతో చిన్నపాటి ద్వీపంలా కట్టేసుకుని.. బల్లలు వేసుకుని మందు కొడుతూ.. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే సాంకేతికంగా వారు న్యూజిలాండ్ గడ్డపై లేరని.. అంతర్జాతీయ జలాల్లో ఉన్నారని.. దీంతో మద్య నిషేధానికి లోబడి ఉండాల్సిన అవసరం లేదన్నది వారి వాదన. ఇది తెలిసి పోలీసులు ముక్కున వేలేసుకున్నారు.


