మీ ‘మన్‌కీ బాత్‌’ చెప్పండి! | Rahul Gandhi takes at Mann Ki Baat jibe at Narendra Modi | Sakshi
Sakshi News home page

మీ ‘మన్‌కీ బాత్‌’ చెప్పండి!

Jan 12 2019 3:03 AM | Updated on Mar 18 2019 7:55 PM

Rahul Gandhi takes at Mann Ki Baat jibe at Narendra Modi - Sakshi

దుబాయ్‌: యూఏఈ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న భారతీయ కార్మికుల కృషిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ప్రశంసించారు. దుబాయ్‌లోని జబేల్‌ అలీ లేబర్‌ కాలనీలో సమావేశంలో భారతీయ కార్మికులతో రాహుల్‌ మాట్లాడారు. ‘నా మనసులో మాట(మన్‌ కీ బాత్‌) చెప్పేందుకు రాలేదు. మీరు పడుతున్న కష్టాలను మీ ద్వారానే తెలుసుకుని సాయం చేద్దామని వచ్చా’ అంటూ మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘ఇక్కడ భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎయిర్‌ పోర్టులు, మెట్రో స్టేషన్లు, ఆకాశ హర్మ్యాల నిర్మాణం వంటివి మీ సహకారం లేనిదే సాధ్యం కాదు. ఈ నగరం అభివృద్ధికి మీ స్వేదం, రక్తం ధారపోస్తున్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి మతం, ప్రతి కులం ఖ్యాతిని మీరు చాటుతున్నారు. మీ కృషి భారతీయులను గర్వపడేలా చేస్తోంది’ అంటూ వారిపై ప్రశంసలు కురిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement