పెళ్లి రోజు కేకు ఆర్డర్‌ చేస్తే..

Philippines Couple Pay RS 5 Lakh For Wedding Catering Gets Duped With Thermocol Cake - Sakshi

మనీలా : పెళ్లిరోజు అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన రోజుల్లో ఒకటి. పెళ్లి రోజును మన జీవితంలో మర్చిపోలేము. మన దేశంతో పాటు చాలా దేశాల్లో పెళ్లిరోజును పండుగలా జరుపుకుంటారు.బంధువులను, స్నేహితులను పిలుస్తారు. వారందరికి విందు ఇస్తారు. ఇలా ఆ రోజును చాలా సంతోషంగా గడుపుతారు. అందరిలాగానే ఓ జంట కూడా తమ పెళ్లి రోజును ఘనంగాజరుపోవాలని భావించింది.

దీని కోసం నెల ముందు నుంచే ప్లాన్‌ చేసుకుంది. బంధువులకు, స్నేహితులకు ఆహ్వానం కూడా పంపారు. విందు కోసం రూ.5లక్షలులతో ఓ ప్రముఖక్యాటరింగ్ సంస్థకు ఆర్డర్‌ ఇచ్చారు. చివరకు క్యాటరింగ్‌ సంస్థ చేసిన మోసానికి అందరి ముందు తలదించుకున్నారు. వారు ఆర్డర్‌ చేసిన పుడ్‌ సప్లై చేయకపోవడమే కాకుండా, భారీ కూల్‌ కేకుకు బదులు థర్మకోల్‌ కేకు పార్శిల్‌ ఇచ్చి నలుగురి ముందు నవ్వులపాలు చేశారు.

వివరాలు.. ఫిలిప్పీన్స్ దేశంలో పాసిగ్‌ సిటీకి చెందిన షైన్‌ తమాయో తన పెళ్లి రోజు ఘనంగా జరుపోవాలకున్నారు. నగరానికి చెందిన ప్రముఖ క్యాటరింగ్‌ సంస్థకు రూ. 5లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చి వింధు ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు బంధువులు, స్నేహితులు అంతా తన ఇంటి వచ్చారు. వింధు కోసమై వెళ్లి చూడగా అక్కడ పుడ్‌ ఏర్పాటు చేయలేదు. దింతో పక్క వీధిలో ఉన్న హోటల్‌లో పుడ్‌ తెప్పించి వారికి వింధు ఇచ్చారు.

అనంతరం కేకు కటింగ్‌ వెళ్లారు. అందరు చూట్టూఉండగా ఆ జంట కేక్‌ కట్‌ చేసింది. అది చూసి బంధువుతలతో పాటు, వారు కూడా షాకయ్యారు. అది కేకు కాదు థర్మకోల్. కేకు ఆకారంలో థర్మకోల్‌ను తయారు చేసి పైన రంగు వేశారు. ఇది చూసి పెళ్లి రోజు ఆ జంట బోరుమంది. క్యాటరింగ్‌ సంస్థ చేసిన మోసానికి తాము బలైపోయామని వాపోయారు. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఏదేమైనా పెళ్లి రోజు ఆ జంటకు తీవ్ర నిరాశ ఎదురైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top