బొమ్మ ఇల్లు.. రేటు వింటే గుండె జల్లు.. | Parsian building model price more expensive | Sakshi
Sakshi News home page

బొమ్మ ఇల్లు.. రేటు వింటే గుండె జల్లు..

Aug 25 2014 2:13 AM | Updated on Sep 2 2017 12:23 PM

బొమ్మ ఇల్లు.. రేటు వింటే గుండె జల్లు..

బొమ్మ ఇల్లు.. రేటు వింటే గుండె జల్లు..

ఇదో బొమ్మ ఇల్లు.. చిన్నప్పుడు స్కూల్లో మనం కూడా చిన్నచిన్న ఇళ్లు.. అట్టముక్కలతో తయారుచేయడం.. వాటిల్లో ఫర్నిచర్ పెట్టడం ఇలాంటివి ఎన్నో చేసుంటాం..

ఇదో బొమ్మ ఇల్లు.. చిన్నప్పుడు స్కూల్లో మనం కూడా చిన్నచిన్న ఇళ్లు.. అట్టముక్కలతో తయారుచేయడం.. వాటిల్లో ఫర్నిచర్ పెట్టడం ఇలాంటివి ఎన్నో చేసుంటాం.. చిత్రంలో కనిపిస్తున్న సుసీ, కెన్‌కు పెద్దయ్యాక కూడా ఆ అలవాటు పోలేదు. అందుకే ప్యారిస్‌లో ఉన్న 19వ శతాబ్దపు నాటి ఓ పర్షియన్ భవంతి మోడల్ స్ఫూర్తితో ఈ బొమ్మ ఇల్లును తయారు చేశారు. బాగుంది కదానీ.. మీ అమ్మాయికో.. అబ్బాయి కోసమే కొందామనుకునేరు.. ఎందుకంటే.. దీన్ని కొనేందుకు అయ్యే డబ్బుతో మనం నిజం ఇల్లు కట్టేసుకోవచ్చు.
 
దీని ధర రూ.కోటికిపైనే.. అంతెందుకు అయ్యిందంటే.. ఐదున్నర అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉన్న ఈ బొమ్మ ఇల్లు లోపలి భాగం చూస్తే.. తెలుస్తుంది. ప్రతీది ఆ ఒరిజినల్ భవంతిలో ఎలాగుందే.. అచ్చం అలాగే రూపొందించారు. ఇవి అట్టతో చేసినవి కావు. ఖరీదైన కలప, గ్లాసు వంటివాటితో తయారుచేశారు. బ్రిటన్‌లోని హోల్ట్ గ్రామానికి చెందిన సుసీ, కెన్ జంట ఆర్ట్ హిస్టారియన్స్. 30 ఏళ్లుగా వీరి పని ఇదే. ఫ్రెంచి చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఆ పర్షియన్ భవంతిని తయారుచేయమని ఓ కస్టమర్ ఏడాది క్రితం వీరికి ఆర్డర్ ఇచ్చాడట. అప్పుడు మొదలుపెడితే.. ఇప్పటికి పూర్తయింది.

Advertisement
 
Advertisement
Advertisement