భారత్‌ దాడిచేస్తే మేం సిద్ధమే: ఇమ్రాన్‌

Pakistan observes Kashmir Hour to express solidarity with Kashmiris - Sakshi

ఇస్లామాబాద్‌: తుదిశ్వాస వరకు కశ్మీరీలకు అండగా ఉంటా మని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పారు. కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని భారత్‌ రద్దు చేయడాన్ని నిరసిస్తూ కశ్మీరీలకు సంఘీభావంగా శుక్రవారం పాక్‌ వ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఇమ్రాన్‌ మాట్లాడారు. ‘పాకిస్తానీలు కష్టకాలంలో ఉన్న కశ్మీరీలకు మద్దతు తెలుపుతున్నారు. కశ్మీరీల బాధను పంచుకునేందుకు, పూర్తి స్థాయి మద్దతు తెలిపేందుకే నిరసనలు తెలుపుతున్నాం. తుదిశ్వాస వరకు కశ్మీరీల వెన్నంటే ఉంటాం. కశ్మీర్‌పై అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు భారత్‌ సైనిక చర్యకు దిగనుందని సమాచారం ఉంది. ఎలాంటి దురాక్రమణలనైనా నిలువరించేందుకు పాక్‌ ఆర్మీ సిద్ధంగా ఉంది’ అని ఇమ్రాన్‌ అన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top