‘భారత సైనికులను చంపాం..’ ‘అంతా అబద్ధం’

Pakistan Claims It Killed 5 Indian Soldiers - Sakshi

ఇస్లామాబాద్‌ : భారత్‌కు చెందిన ఆర్మీ పోస్ట్‌ను ధ్వంసం చేసినట్లు పాక్‌ ప్రకటించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తట్టపాని సెక్టార్‌లోని ఆర్మీ స్థావరంపై తాము దాడి చేశామని, ఐదుగురు భారత్‌ సైనికులను చంపేశామని పాక్‌ ఆర్మీ మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫార్‌ గురువారం రాత్రి ట్వటర్‌ ద్వారా వెల్లడించారు.

ఆర్మీ స్థావరంపై బాంబు దాడి చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను కూడా ట్విటర్‌ ద్వారా పోస్ట్‌ చేశారు. ఈ వీడియోలో బాంబు దాడి జరిగి భారీ ఎత్తున దుమ్ముధూళితో కూడిన పొగ కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, భారత్‌ ఈ వార్తలను కొట్టిపారేసింది. పాకిస్థాన్‌ చెబుతుందంతా ఒట్టి బూటకమని, ఆధారరహితంగా మాట్లాడుతోందని, అసలు దాడి జరగలేదని, భారత సైనికులు చనిపోలేదని భారత ఆర్మీ ప్రకటించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top