జనావాసాల్లో కూలిన విమానం.. 17 మంది మృతి

Pakistan Army Plane Crashes Into Residential Area At Rawalpindi - Sakshi

రావల్పిండి : పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన విమానం కూప్పకూలిన ఘటనలో 17 మంది మృతిచెందారు. మంగళవారం తెల్లవారు జామున రావల్పిండిలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా పాక్‌ అధికారులు తెలిపారు. మృతుల్లో 5 గురు విమాన సిబ్బంది కాగా, 12 మంది పౌరులు ఉన్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందిని దగ్గర్లోని అధికారులు ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

ఈ విమానాన్ని పాక్‌ ఆర్మీ ట్రైనింగ్‌ కోసం వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. విమానం కుప్పకూలడంతో ఆ చుట్టపక్కల పలు ఇళ్లకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ప్రమాదం జరిగిన చోటుకి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top