శశికళ మాజీ సీఎం?.. ఇదేంది ఇమ్రాన్‌ ఖాన్‌!? | Pak Politician Imran Khan Confuses Jayalalithaa With Sasikala | Sakshi
Sakshi News home page

శశికళ మాజీ సీఎం?.. ఇదేంది ఇమ్రాన్‌ ఖాన్‌!?

Dec 21 2017 2:54 PM | Updated on Dec 21 2017 3:20 PM

Pak Politician Imran Khan Confuses Jayalalithaa With Sasikala - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ దారుణంగా పొరపడ్డారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరును శశికళగా పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ మధ్యే చనిపోయిన శశికళ.. ప్రజల మనసుల్లో బతికే ఉన్నారంటూ.. ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఇమ్రాన్‌ ఖాన్‌.. వాస్తవాలు తెలుసుకుని ట్వీట్‌ చేస్తే మంచిది. లేకపోతే పరువు పోతుంది అంటూ విమర్శకులు వరుస ట్వీట్లు గుప్పించారు. 

అవినీతి గురంచి ఇమ్రాన్‌ మాట్లాడుతూ... ‘దక్షిణ భారత ప్రముఖ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి శశికళ ఈ మధ్యే మరణించారు. ఆమె ఇంట్లో భారీ స్థాయిలో బంగారు, వెండి, కోట్ల రూపాయల అక్రమ సొమ్మును గుర్తించారు. ఇదంతా అవినీతి సొమ్మే. పేద ప్రజల నుంచి దోచుకున్నదే’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. వెంటనే ఇమ్రాన్‌ ఖాన్‌ వెంటనే తొలగించారు. 

ఇమ్రాన్‌ తప్పుడు ట్వీట్‌పై గల్ఫ్‌ న్యూస్‌లో సీనియర్‌ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న సాదిక్‌ ఎస్‌ భట్‌ గుర్తించారు. వెంటనే ఆయన డియర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌, మీరు తప్పుడు ట్వీట్‌ చేశారు. దానిని దిద్దుకోండి అంటూ రిప్లయి ట్వీట్‌ చేశారు. అంతేకాక చనిపోయింది జయలలిత అని, అవినీతి ఆరోపణలపై ఇప్పుడు జైల్లో ఉన్నది శశికళ అని ఆయన చెప్పారు. జయలలితకు శశికళ స్నేహితురాలు అని చెప్పారు. ఇదిలాఉండగా.. గతంలోనూ ఇమ్రాన్‌ ఖాన్‌ ఇలాంటి తప్పుడు ట్వీట్లు చాలనే చేశారు. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ గురించి కూడా ఇటువంటి పొరపాటునే ట్విటర్‌లో చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement