‘ఉగ్రవాద కమాండర్‌ వర్ధంతిని జరపడం సిగ్గుచేటు’

Pak Groups Hold Protest Outside Indian High Commission in UK - Sakshi

లండన్‌ : హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బర్హాన్‌ వనీ మరణించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన వర్ధంతి రోజున యూకేకు చెందిన పాకిస్తాన్‌ వేర్పాటువాద సంస్థలు లండన్‌లోని భారత హైకమిషన్‌ ఎదుట నిరసనలు చేపట్టారు. గ్లోబల్ కశ్మీర్, పాకిస్తాన్ కౌన్సిల్ చైర్మన్ రాజా సికందర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత సంకేళ్ల నుంచి తన మాతృభూమి విముక్తి కోసం తన జీవితానికి త్యాగం చేసిన షాహీద్ బుర్హాన్ వనీ అమరుడై నాలుగేళ్ల జ్ఞాపకార్థం తాము సంఘీభావం తెలుపుతున్నామని తెలిపారు. ఈ నిరసనకు ఓవర్సీస్ పాకిస్తాన్ వెల్ఫేర్ కౌన్సిల్,గ్లోబల్ పాకిస్తాన్, కాశ్మీర్ సుప్రీం సహా బృందాలు మద్దతిచ్చాయి. కాగా కశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు బుర్హాన్ వనీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. 2016 జూలైలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బర్హాన్‌ వనీని భారత ఆర్మీ సైన్యం మట్టుబెట్టింది. (నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్ల నిలిపివేత)

మెట్రోపాలిటన్ పోలీసులు, యూకే విదేశీ, కామన్వెల్త్ కార్యాలయం,హోమ్ ఆఫీస్ అందించిన భద్రతా సహకారాన్ని లండన్‌లోని భారత హైకమిషన్ స్వాగతించింది. 2016లో బర్హాన్‌ మరణించక ముందు తన బృందంతో కశ్మీర్‌లో ఎన్నో అల్లర్లు, దాడులు జరిపాడని ఈ దాడుల్లో ఎంతో మంది జవాన్లు, పౌరులు మరణించినట్లు భారత మిషన్ కమ్యూనికేషన్ పేర్కొంది. అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్‌కు జమ్మూ కాశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు సృష్టించిన చరిత్ర ఉందని అధికారులు స్పష్టం చేశారు. (భారత్‌-చైనా సరిహద్దులో మెరుగవుతున్న పరిస్థితులు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top