'కాల్పులు కాదు.. అలాంటి పెద్ద శబ్దం మాత్రమే' | no firing in los Los Angeles International Airport, | Sakshi
Sakshi News home page

'కాల్పులు కాదు.. అలాంటి పెద్ద శబ్దం మాత్రమే'

Aug 29 2016 11:33 AM | Updated on Oct 2 2018 2:30 PM

లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

 
లాస్ ఎంజెల్స్: లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎలాంటి కాల్పుల ఘటనలు చోటుచేసుకోలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఒక పెద్ద శబ్దం మాత్రమే వచ్చి దాన్ని ఎయిర్ పోర్ట్ సిబ్బంది కాల్పులుగా భ్రమపడ్డారని చెప్పారు.  అమెరికాలోని లాస్ ఎంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకున్నాయని తొలుత కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

తొలుత కాల్పుల శబ్దం విన్న సిబ్బంది ఈ సమాచారాన్ని అధికారులకు చెప్పడంతో వారు వేగంగా స్పందించారు. స్వాట్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాయి. కీలక సాయుధ బలగాలను మోహరించాయి. విమానాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. చాలామంది ప్రయాణికులు కాల్పుల ఘటన జరిగిన నేపథ్యంలో పరుగులు పెట్టారు. మరికొందరిని ప్రయాణీకులను సురక్షితంగా సమీపంలోని రెస్టారెంట్లకు తరలించారు. అయితే, తీవ్ర స్థాయిలో గాలింపులు చేపట్టిన పోలీసులు చివరకు కాల్పులు జరగలేదని, ఉగ్రవాదులు లేరని స్పష్టం చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement