నేపాల్‌ కొత్త స్పీకర్‌గా మహారా

Nepal New Speaker Krishna Bahadur Mahara  - Sakshi

ఖాట్మాండు : నేపాల్‌ పార్లమెంట్‌ కొత్త స్పీకర్‌గా సీపీఎన్‌ మావోయిస్టు సెంటర్‌ నేత కృష్ణ బహదూర్‌ మహారా శుక్రవారం ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయనొక్కరే పోటీ చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం నిర్వహించబోయే ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఈ ఎన్నికకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. 

కాగా, మహారా అభ్యర్ధిత్వాన్ని సీపీఎన్‌-యూఎమ్‌ఎల్‌ శాసన సభ్యులు సుభాష్‌ చంద్ర నేమాంగ్‌, సీపీఎం లీడర్‌ దేవ్‌ గురుంగ్‌ ప్రతిపాదించి సమర్థించారు. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న ఉద్దేశంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేపాల్‌ కాంగ్రెస్‌ తమ తరపున అభ్యర్ధిని బరిలో నిలుపలేదు. మహారాకు గతంలో  మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top