భూకంప మృతుల సంఖ్య 15 వేలు దాటొచ్చు! | Nepal earthquake, International aid effort increased | Sakshi
Sakshi News home page

భూకంప మృతుల సంఖ్య 15 వేలు దాటొచ్చు!

Apr 27 2015 8:53 PM | Updated on Oct 20 2018 6:37 PM

సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమైన రెస్క్యూ బృందాలు - Sakshi

సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమైన రెస్క్యూ బృందాలు

నేపాల్ సంభవించిన పెను భూకంపంలో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య అంచనాలకు అందడం లేదు.

కఠ్మండు:నేపాల్ సంభవించిన పెను భూకంపంలో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య అంచనాలకు అందడం లేదు. శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతుంటడంతో మృతుల సంఖ్య  భారీగా పెరిగే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు స్పష్టం చేస్తున్నాయి. నేపాల్ భూకంపంలో మృతుల సంఖ్య 15 వేలు దాటొచ్చని  రెస్క్యూ బృందాలు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించాయి.

 

వందల కొద్దీ గ్రామాలు పూర్తిగా నేలమట్టం కావడంతో పాటు వేలాది ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పటికే కొండ ప్రాంత గ్రామాలకు అధికారులు మీడియా చేరుకోలేపోవడంతో ఈ దుర్ఘటన జరిగిన తీరుకు అద్దం పడుతోంది. నేపాల్ దాదాపు రవాణా వ్యవస్థతో పాటు సమాచార వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం కష్ట సాధ్యంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement