’దాడిచేసే కుక్కలాంటివాడి తోడు కావాలి’ | Need An 'Attack Dog' As Running Mate, Says Donald Trump | Sakshi
Sakshi News home page

’దాడిచేసే కుక్కలాంటివాడి తోడు కావాలి’

Jul 13 2016 10:14 AM | Updated on Apr 8 2019 7:50 PM

’దాడిచేసే కుక్కలాంటివాడి తోడు కావాలి’ - Sakshi

’దాడిచేసే కుక్కలాంటివాడి తోడు కావాలి’

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి గబ్బుమాట మాట్లాడారు. తనకు తోడుగా ఓ దాడి చేసే కుక్కలాంటి వాడు కావాలని అన్నారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి గబ్బుమాట మాట్లాడారు. తనకు తోడుగా ఓ దాడి చేసే కుక్కలాంటి వాడు కావాలని అన్నారు. తాను అధ్యక్షుడు అయితే, తనతోపాటు ఉండబోయే ఉపాధ్యక్షుడికి ఇలాంటి లక్షణాలు ఉండాలి అని పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ అందరిని అవాక్కయ్యేలా చేశాడు. అంతేకాకుండా తాను ఈ మాట ఎవరిని ఆశ్చర్యపరిచేందుకో, ఆటలాడేందుకో చెప్పడం లేదని, అంతటి సమర్థంగా పనిచేసే లక్షణాలు ఉండాలని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు.

ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్ పలు టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్, మాజీ స్పీకర్ గింగ్రిచ్, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, అలబామా సెనేటర్ జెఫ్, మరో ఇద్దరు రాజకీయ నాయకులతోపాటు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడి అంశంపై చర్చ వచ్చినప్పుడు ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. పరిస్థితులకు తగినట్లుగా పనిచేసే వ్యక్తి తనకు తోడుగా ఉండాలని, ఒక్క మాటలో చెప్పాలంటే ఓ దాడి చేసే కుక్కలాగా పనిచేయగలగాలని, అలాంటివాడి తోడు తనకు అవసరం అని ట్రంప్ చెప్పారు. తనను ఎంతోమంది ఎన్నో మాటలతో విమర్శిస్తుంటారని, అయితే, వ్యక్తిగత అభిప్రాయాలు కలిస్తేనే సమర్థంగా ముందుకెళ్లగలమని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement