పాక్ ఎంపీల్లో అత్యంత ధనికుడు నవాజ్ | Nawaz sharif is Richest MP in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్ ఎంపీల్లో అత్యంత ధనికుడు నవాజ్

Dec 27 2013 1:43 AM | Updated on Sep 2 2017 1:59 AM

పాకిస్థాన్ పార్లమెంటు సభ్యుల్లోకెల్లా అత్యంత ధనవంతుడు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫే.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ పార్లమెంటు సభ్యుల్లోకెల్లా అత్యంత ధనవంతుడు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫే. ఆయన ఆస్తి పాక్ కరెన్సీలో రూ.150 కోట్లకుపైగా ఉందని పాక్ ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మిగిలిన ఎంపీల్లో చాలా మంది చక్కెర, వస్త్ర రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, వ్యాపారులున్నారని పేర్కొంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన డిక్లరేషన్‌లో నవాజ్ షరీఫ్ పేర్కొన్న ఆస్తుల జాబితాలో రూ.143 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, రూ.1.30 కోట్ల మేర పెట్టుబడులు, 6 మిల్లుల్లో షేర్లు, వివిధ బ్యాంకుల్లో రూ.12.6 కోట్ల నగదు, ఓ టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనం, రెండు బెంజ్ కార్లు, 1991 మోడల్ ట్రాక్టర్, భార్య పేర రూ.15 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement