మార్స్‌పై ఏం జరుగుతోంది..? | NASA's MAVEN Mission Finds Unexpected Activity in Mars' Atmosphere | Sakshi
Sakshi News home page

మార్స్‌పై ఏం జరుగుతోంది..?

Mar 20 2015 7:43 AM | Updated on Sep 2 2017 11:09 PM

మార్స్‌పై ఏం జరుగుతోంది..?

మార్స్‌పై ఏం జరుగుతోంది..?

అంగారకుడి ఉత్తర ధ్రువంపై గత డిసెంబర్ 25కు ముందు ఐదు రోజులపాటు ప్రకాశవంతమైన ధ్రువకాంతులు(ఆరోరా)ఏర్పడ్డాయట.

యూఎస్: అంగారకుడి ఉత్తర ధ్రువంపై గత డిసెంబర్ 25కు ముందు ఐదు రోజులపాటు ప్రకాశవంతమైన ధ్రువకాంతులు(ఆరోరా)  ఏర్పడ్డాయట. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ‘మావెన్’ ఉపగ్రహం వీటిని కెమెరాలో బంధించింది. మార్స్ వాతావరణంలో గుర్తు తెలియని భారీ ధూళిమేఘాలను సైతం మావెన్ గుర్తించింది.

భూమిపై మాదిరిగా కాకుండా అరుణగ్రహంపై ధ్రువ కాంతులు లోతుగా ఏర్పడటం, ధూళి మేఘాలు ఏకంగా 300 కి.మీ. ఎత్తుకు వ్యాపించడం అనేవి శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. ఈ ప్రక్రియలకు రకరకాల కారణాలను చెబుతున్నా.. వాస్తవమేంటో ఇంకా నిర్ధారించలేకపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement