'గాంధీ, శాస్త్రి కాదు.. ఛాయ్వాలా చెప్పినా చేశారు' | Narendra Modi Addresses Indian Community in Singapore | Sakshi
Sakshi News home page

'గాంధీ, శాస్త్రి కాదు.. ఛాయ్వాలా చెప్పినా చేశారు'

Nov 24 2015 6:47 PM | Updated on Aug 15 2018 2:20 PM

'గాంధీ, శాస్త్రి కాదు.. ఛాయ్వాలా చెప్పినా చేశారు' - Sakshi

'గాంధీ, శాస్త్రి కాదు.. ఛాయ్వాలా చెప్పినా చేశారు'

భారత్లో ఒకప్పుడు పక్క కుర్చీ కూడా వదలకూడదని అనుకునేవాళ్లు, ఇప్పుడు సబ్సిడీలను వదిలేసుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

భారత్లో ఒకప్పుడు పక్క కుర్చీ కూడా వదలకూడదని అనుకునేవాళ్లు, ఇప్పుడు సబ్సిడీలను వదిలేసుకుంటున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన మోదీ.. మంగళవారం అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసింగించారు. మోదీ ఏమన్నారంటే..

సిద్ధి, ప్రసిద్ధిలో చాలా తేడా ఉంటుంది. ఏం చేసినా.. ప్రసిద్ధి వస్తుంది గానీ, సిద్ధి మాత్రం అంత సులభంగా రాదు
కావాలంటే ప్రసిద్ధులు కావచ్చుగానీ భూమ్మీద మార్పు మాత్రం తేలేరు
50 ఏళ్ల కాలంలో ఒకే తరం కళ్ల ముందు.. ఒక దేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లచ్చు అనేదానికి సింగపూర్ మంచి ఉదాహరణ
భారత్ గొప్ప దేశం, విశాలమైన దేశం, 125కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ సింగపూర్ నుంచి చాలా నేర్చుకోవాలి
మన దేశం ఈ పని చేయలేదా? చేయాలా.. వద్దా?
ఇక్కడి ప్రజలకు భూమిపై హక్కుందా లేదా?
మహాత్మాగాంధీ ఒక్క విషయం మీదే చాలా చెప్పేవారు.. అదే స్వచ్ఛత, శుభ్రత
స్వాతంత్ర్యం, శుభ్రత ఏది కావాలంటే.. నేను ముందు శుభ్రతకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పేవారు
ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్కరికీ అనిపిస్తోంది.. మన దేశం ఇలా దుర్భరంగా ఉండకూడదని
ప్రపంచం మారుతోంది భారత్ మారాలా.. వద్దా?
మంచి విషయం ఏమిటంటే, 125 కోట్లమంది దేశవాసులు మారాలని నిశ్చయించుకున్నారు
ఏదైనా దేశం కేవలం ప్రభుత్వాలతో ఎదగదు.. ప్రతి ఒక్కళ్ల మన సంకల్పంతో, వాళ్ల కృషితో, వాళ్ల త్యాగాలు, తపస్సుతోనే ఎదుగుతుంది. అప్పుడే దేశ నిర్మాణం సాధ్యం
మన దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని ప్రతి భారతీయుడికి అనిపిస్తోంది
మనకు ఏమైనా దొరికిందంటే.. దాన్ని వదలాలని మనసుకు అనిపించదు
మనం ప్రయాణం చేసేటప్పుడు మన సీటు రిజర్వ్ అయి.. పక్క సీటు ఖాళీ ఉంటే మన బ్యాగ్ అక్కడ పెట్టేస్తాం. అది మన సీటు కాదు, అయినా వేరేవాళ్లు రావడం ఆలస్యం అయితే మనం అక్కడ పెట్టేస్తాం. వాళ్లు వచ్చాక చూద్దాం అనుకుంటారు
అది మనది కాదు కానీ కొన్ని క్షణాలు వాడుకోడానికి దొరికితే వదలబుద్ధి కాదు
ఇది మనిషి ప్రవృత్తి. కానీ నేను మాత్రం మన దేశవాసుల మనసు ఏంటో చూశాను.. భారతీయులు మంచి ఆలోచన చేస్తున్నారు
ఓసారి నేను చెప్పాను.. మీరు ఇళ్లలో గ్యాస్ పొయ్యి వెలిగిస్తారు. ఆ సిలెండర్‌లో 500 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. మీరు ఆ 500 రూపాయలు భరించగలిగే పరిస్థితిలో ఉంటే సబ్సిడీ వదిలేయొచ్చు కదా అన్నాను
ఇప్పుడు గర్వంగా చెబుతున్నా.. 40 లక్షల కుటుంబాలు గ్యాస్ సబ్సిడీ స్వచ్ఛందంగా వదిలేసుకున్నాయి
ఒకప్పుడు పక్క కుర్చీ కూడా వదలకూడదని అనుకునేవాళ్లు.. ఇప్పుడు సబ్సిడీలను వదిలేసుకుంటున్నారు
అది కూడా.. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చెబితే చేయడం కాదు.. మామూలు చాయ్ అమ్ముకునేవాడు చెప్పినా చేశారు
మన దేశం స్వామి వివేకానంద కలలుగన్న భారతమాతగా రూపొందుతోంది.. విశ్వగురువుగా మారుతోంది
మన దేశంలో ఎన్ని విశేషాలు, ఎన్ని శషభిషలు ఉన్నాయో.. అన్నే సింగపూర్‌లో కూడా ఉన్నాయి.
అయినా కూడా.. ప్రతి ఒక్కరూ సింగపూర్ వాసి. ప్రతి ఒక్కరూ ఈ దేశనిర్మాణాన్ని భుజాలకు ఎత్తుకున్నారు
మేం కూడా ఈ విషయంలో సింగపూర్ నుంచి చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నాం
వసుధైక కుటుంబం.. అనే మంత్రం ఎక్కడినుంచి వచ్చిందో అక్కడ అదే భావన దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది, బలోపేతం చేస్తుంది. ఆ భావనను ముందుకు తీసుకెళ్లడానికి మేం కృషిచేస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement