ఆ వలయాలు ఇలా పుట్టాయి! | Mystery behind birth of Saturn's rings solved | Sakshi
Sakshi News home page

ఆ వలయాలు ఇలా పుట్టాయి!

Nov 2 2016 1:41 PM | Updated on Sep 4 2017 6:59 PM

ఈ వలయాలు 400 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పాడ్డాయని వారు తేల్చారు.

టోక్యో: శని, నెఫ్టూ్యన్, యురేనస్‌.. ఈ మూడు గ్రహాలకు ఒక పోలిక ఉంది. అది వాటి చుట్టూ వలయాలు ఉండడమే. ఇవి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడ్డాయో అనే విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇన్నాళ్లకు ఈ వలయాల వెనుకున్న రహస్యాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వలయాలు 400 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పాడ్డాయని వారు తేల్చారు.

ప్లూటో గ్రహ పరిమాణంలో ఉన్న పెద్ద పెద్ద పదార్థాలు విశ్వంతరాల నుంచి ఈ గ్రహాల సమీపంలోకి వచ్చి ఆకర్షణ బలాలకు లోనై ధ్వంసమవుతుంటాయని పరిశోధకులు తెలిపారు. అలా ధ్వంసమైన పదార్థాలే గ్రహం చుట్టూ వలయాలుగా మారి భ్రమిస్తుంటాయని పరిశోధకులు చెప్పారు. ఈ మేరకు కోబ్‌ యూనివర్సిటీ, టోక్యో టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధనలు ఈ దృగ్విషయాన్ని కనుగొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement