ఆ వలయాలు ఇలా పుట్టాయి!
టోక్యో: శని, నెఫ్టూ్యన్, యురేనస్.. ఈ మూడు గ్రహాలకు ఒక పోలిక ఉంది. అది వాటి చుట్టూ వలయాలు ఉండడమే. ఇవి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడ్డాయో అనే విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇన్నాళ్లకు ఈ వలయాల వెనుకున్న రహస్యాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వలయాలు 400 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పాడ్డాయని వారు తేల్చారు.
ప్లూటో గ్రహ పరిమాణంలో ఉన్న పెద్ద పెద్ద పదార్థాలు విశ్వంతరాల నుంచి ఈ గ్రహాల సమీపంలోకి వచ్చి ఆకర్షణ బలాలకు లోనై ధ్వంసమవుతుంటాయని పరిశోధకులు తెలిపారు. అలా ధ్వంసమైన పదార్థాలే గ్రహం చుట్టూ వలయాలుగా మారి భ్రమిస్తుంటాయని పరిశోధకులు చెప్పారు. ఈ మేరకు కోబ్ యూనివర్సిటీ, టోక్యో టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ పరిశోధనలు ఈ దృగ్విషయాన్ని కనుగొన్నారు.