'వాడి తల్లినైనందుకు గర్వంగా ఉంది' | Mother Smothered Her Newborn To Death Because He Wouldn't Stop Crying, Sheriff Says | Sakshi
Sakshi News home page

'వాడి తల్లినైనందుకు గర్వంగా ఉంది'

May 29 2016 2:34 PM | Updated on Sep 4 2017 1:12 AM

'వాడి తల్లినైనందుకు గర్వంగా ఉంది'

'వాడి తల్లినైనందుకు గర్వంగా ఉంది'

గుక్కపట్టి ఏడుస్తున్నాడనే కోపంతో ఓ తల్లి తన పసిబిడ్డను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఈ ఘటన ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది.

ఉత్తరకరోలినా: గుక్కపట్టి ఏడుస్తున్నాడనే కోపంతో ఓ తల్లి తన పసిబిడ్డను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఈ ఘటన ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది. అయితే, ఆ ఘటన అనుకోకుండా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని ఆమె పోలీసులకు వివరణ ఇచ్చింది. ఉత్తర కరోలినాకు చెందిన ఐషియా మేరీ పచేకో(22) అనే మహిళకు టైలర్ అనే బాలుడు ఉన్నాడు. అతడు మే 20నే జన్మించాడు. ఇటీవల అతడు గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఆ బాలుడ్ని తన ఛాతీపై అదిమి పట్టుకుంది.

దీంతో ఊపరి ఆడని బాలుడు ప్రాణాలుకోల్పోయాడు. దీంతో ఆమె ఎమర్జెన్సీ నంబర్ 911కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అయితే, ఆమె ఇంటికొచ్చిన పోలీసులు బిడ్డ మూతి, ముక్కు లోపలికి నొక్కి ఉండటం గమనించి ఆమెనే ఈ హత్య చేసినట్లు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఈ ఘటనపై వివరణ ఇచ్చిన ఆయేషా.. 'ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. నన్ను క్షమించండి.. అలా చేయాలనుకోవడం నా ఉద్దేశంకాదు. నేను నా బిడ్డను ఎంతో ప్రేమస్తాను. వాడి తల్లిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. బాగా ఏడుస్తున్నాడని నా ఛాతీపై పెట్టుకున్నాను. అంతే తప్ప ఇంకే తప్పు చేయలేదు' అని ఆమె వివరణ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement