పాక్ ప్రధాని మనవరాలి పెళ్లికి మోదీ | Modi attends Nawaz's grand-daughter's wedding | Sakshi
Sakshi News home page

పాక్ ప్రధాని మనవరాలి పెళ్లికి మోదీ

Dec 25 2015 6:57 PM | Updated on Aug 21 2018 9:39 PM

పాక్ ప్రధాని మనవరాలి పెళ్లికి మోదీ - Sakshi

పాక్ ప్రధాని మనవరాలి పెళ్లికి మోదీ

ఊహించని విధంగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరయ్యారు.

లాహోర్: ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం మోదీ, షరీఫ్ కలిసి ఓ ప్రత్యేక హెలికాప్టర్‌లో లాహోర్ నగర శివారు రాయ్విండ్లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లారు. పాక్ ప్రధాని తన కుటుంబ సభ్యులను మోదీకి పరిచయం చేశారు. రాయ్విండ్లోని షరీఫ్ నివాసంలో శుక్రవారమే ఆయన మనవరాలి పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లికి హాజరైన తర్వాత.. షరీఫ్‌ నివాసంలో ఇరు దేశాల ప్రధానులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

అఫ్ఘానిస్తాన్ నుంచి నేరుగా లాహోర్ వచ్చిన మోదీకి.. దాయాది దేశంలో ఘనస్వాగతం లభించింది. లాహోర్  విమానాశ్రయంలో మోదీకి నవాజ్ షరీఫ్‌ సాదరంగా స్వాగతం పలికారు. షరీఫ్కు మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడినుంచి ఇరు దేశాల ప్రధాన మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్లో షరీఫ్ ఇంటికి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement