మహిళా పోలీసు టాప్లెస్ సెల్ఫీ | Mexican police woman suspended for taking topless selfie in patrol car and posting it on Facebook | Sakshi
Sakshi News home page

మహిళా పోలీసు టాప్లెస్ సెల్ఫీ

Apr 20 2016 10:00 AM | Updated on Jul 26 2018 5:23 PM

మహిళా పోలీసు టాప్లెస్ సెల్ఫీ - Sakshi

మహిళా పోలీసు టాప్లెస్ సెల్ఫీ

ఓ మహిళా పోలీసు అధికారి టాప్ లెస్ గా దిగిన ఫోటో ఆమె ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.

ఓ మహిళా పోలీసు అధికారి టాప్ లెస్ గా దిగిన ఫోటో ఆమె ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా గార్సియా ఆనే మహిళ పోలీసు టాప్ లెస్ సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాం ను కిందికు దించి రొమ్ము భాగం కనబడేలా సెల్ఫీ దిగింది. అంతేకాకుండా ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు  విచారణకు ఆదేశించారు. యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. అంతే కాకుండా నిదియా సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఇతర సిబ్బంది కూడా పక్కనే ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తుకు ఆదేశించారు.

అలా చేసినందుకు తనను తానే అసహ్యించుకుంటున్నానని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నిదియా తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. తన ఇద్దరు కూతుళ్లు, భర్త,  తల్లిదండ్రులు, సోదరులకు చెడ్డ పేరు తీసుకు వచ్చానని వాపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement