పెళ్లయితే ఇక అంతే!

మెక్సికోకు చెందిన ఐదుగురు మిత్రులు.. వారికి ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగినా వెంటనే అక్కడ వాలిపోయేంత ఇష్టం. 2014 బ్రెజిల్ వరల్డ్ కప్ సందర్భంగా వీరంతా అక్కడికి వెళ్లి చాలా ఎంజాయ్ చేసి వచ్చారు. రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్‌కు హాజరుకావాలని అప్పుడే నిర్ణయం తీసేసుకున్నారు. అప్పటినుంచే డబ్బులు కూడా ఆదా చేసుకుంటూ వచ్చారట. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆ ఆటలకు జేవియర్ హాజరు కాలేకపోయాడు.
ఎందుకంటే అతడికి పెళ్లయింది. పెళ్లయితే ఏంటి అనే కదా మీ ప్రశ్న. జేవియర్ సడన్‌గా ఏప్రిల్‌లో తాను రాలేకపోతున్నానని.. తన భార్య అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదని మిగతా వారికి చెప్పాడట. ఎంత బతిమాలినా కూడా తన భార్య ఒప్పుకోలేదట. కానీ వారికేమో ఆ ఒక్కడు రాకపోతే ఎలా అని తర్జనభర్జన పడ్డారట. చివరికి ఓ మంచి ఐడియా వచ్చింది వారికి. అదేంటంటే జేవియర్ నిలువెత్తు ఫొటో కార్డ్‌బోర్డ్‌ను తయారు చేయించి వారితో పాటు రష్యాకు తీసుకొచ్చుకున్నారు. జేవియర్‌తో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేసరికి ఆ ఫొటోలకు ప్రపంచవ్యాప్తంగా తెగ క్రేజ్ వస్తోంది!
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి