స్పెయిన్‌ గుప్పిట్లోకి కాటలోనియా

Merkel ally calls for EU to close external borders for SECURITY

మాడ్రిడ్‌: ఐరోపా దేశం స్పెయిన్‌లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న మరుసటి రోజే కాటలోనియాను స్పెయిన్‌ తన ప్రత్యక్ష పాలనలోకి తీసుకుంది. వేర్పాటువాదులకు సహకరిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాటలోనియా పోలీస్‌ చీఫ్‌ జోసెఫ్‌ లూయిస్‌ త్రాపెరోపై శనివారం వేటుపడింది.

స్పెయిన్‌ నుంచి విడిపోవడానికి అక్టోబర్‌ 1న కాటలోనియా నిర్వహించిన రెఫరెండాన్ని అడ్డుకోవాలన్న కోర్టు ఆదేశాలను త్రాపెరో బేఖాతరు చేశారని స్పెయిన్‌ ప్రభుత్వం ఆరోపించింది. కాటలోనియా విద్య, ఆరోగ్యం, పోలీసు, సివిల్‌ సర్వీసెస్‌ తదితర సేవలన్నీ స్పెయిన్‌ అధీనంలోకి వెళ్తాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top