ప్రియుడి పుర్రెలో నుంచి ప్రియురాలికి బుల్లెట్‌.. | Man shoots self, bullet goes through his head, kills girlfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడి పుర్రెలో నుంచి ప్రియురాలికి బుల్లెట్‌..

May 25 2017 6:32 PM | Updated on Sep 5 2017 11:59 AM

ప్రియుడి పుర్రెలో నుంచి ప్రియురాలికి బుల్లెట్‌..

ప్రియుడి పుర్రెలో నుంచి ప్రియురాలికి బుల్లెట్‌..

ఓ యువకుడు చేసిన ఆత్మహత్యాయత్నం అతడి ప్రియురాలి ప్రాణం తీసింది. తన తలకు తుపాకీ గురిపెట్టుకొని కాల్చుకోగా అతడికి మాత్రం గాయంకాగా అతడి ప్రియురాలు మాత్రం మృత్యువాత పడింది.

వాషింగ్టన్‌: ఓ యువకుడు చేసిన ఆత్మహత్యాయత్నం అతడి ప్రియురాలి ప్రాణం తీసింది. తన తలకు తుపాకీ గురిపెట్టుకొని కాల్చుకోగా అతడికి మాత్రం గాయంకాగా అతడి ప్రియురాలు మాత్రం మృత్యువాత పడింది. ఈ ఘటనకు సంబంధించి అతడు ఆదివారం కోర్టుకు రాగా, అతడిపై సెకండ్‌ డిగ్రీ హత్యగా పేర్కొంటూ అమెరికా కోర్టు అతడిపై అభియోగాలు ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే.. విక్టర్‌ సిబ్సన్‌(21) అనే యువకుడు, బ్రిటనీ మే హాగ్‌ (22) అనే యువతి ప్రేమికులు. అయితే, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సిబ్సన్‌ తుపాకీతో కాల్చుకోగా అతడి తల పుర్రెపై భాగంలో నుంచి దూసుకెళ్లిన బుల్లెట్‌ నేరుగా అతడి ప్రియురాలు హాగ్‌ కణతలోకి దూసుకెళ్లింది. దీంతో వారిద్దరు తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు.

అయితే, తీవ్ర గాయంతో హాగ్‌ చనిపోగా అతడు మాత్రం పుర్రె పైభాగం నుంచి బుల్లెట్‌ దూసుకుపోయిన కారణంగా బతికిబయటపడ్డాడు. అయితే, అకారణంగా అతడి ప్రేయసి ప్రాణాలుపోవడానికి కారణమైనందున అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన గత నెలలో జరిగింది. విచారణ జరిపిన అధికారులు ఒకే బుల్లెట్‌ వారిద్దరి తలలోకి దూసుకెళ్లినట్లు తేలింది. దీని ప్రకారం వారిద్దరు కలిసి ఆత్మహత్యకు పాల్పడే యత్నం చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement