అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి  | Man Shoots And Five Dies At Illinois In America | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి 

Feb 17 2019 4:03 AM | Updated on Apr 4 2019 3:25 PM

Man Shoots And Five Dies At Illinois In America - Sakshi

షికాగో: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉద్యోగం నుంచి ఉద్వాసనకు గురైన ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెంద గా పోలీసుల కాల్పుల్లో అతడు చనిపోయాడు. ఇల్లినాయిస్‌ సమీపంలో ఉన్న అరోరా పారిశ్రామిక సముదాయంలో ఈ ఘటన జరిగింది. హెన్నీ ప్రాట్‌ అనే పైపుల తయారీ కంపెనీలో గ్యారీ మార్టిన్‌(45) అనే వ్యక్తి 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మార్టిన్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తు న్నట్లు ఆ కంపెనీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. దీంతో తీవ్ర నిస్పృహకు గురైన మార్టిన్‌ వెంటనే తన వద్ద ఉన్న పిస్టల్‌తో తోటివారిపైకి  కాల్పులు జరిపాడు. దీంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి కూడా కాల్పులకు దిగడంతో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో మార్టిన్‌ చనిపోయాడు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఘటనపై ట్విట్టర్‌లో స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement