పసికందును పైఅంతస్థు నుంచి విసిరేసిన రాక్షసుడు | Man murders newborn daughter by using her as club to attack girlfriend | Sakshi
Sakshi News home page

పసికందును పైఅంతస్థు నుంచి విసిరేసిన రాక్షసుడు

Feb 19 2015 9:43 AM | Updated on Sep 2 2017 9:35 PM

పసికందును పైఅంతస్థు నుంచి విసిరేసిన రాక్షసుడు

పసికందును పైఅంతస్థు నుంచి విసిరేసిన రాక్షసుడు

మూడు రోజుల పసికందును మానవత్వం మరిచి కన్నతండ్రే హత్యచేశాడు.

ప్రిటోరియా : రక్తం పంచుకు పుట్టిన పసిగుడ్డు అన్న కనికరం లేని  కన్నతండ్రే దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన దక్షిణాఫ్రికా రాజధానులలో ఒకటైన ప్రిటోరియాలో బుధవారం  చోటుచేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. పోలీసుల కథనం ప్రకారం... అలెగ్జాండర్ ఫోర్బా తన భార్యతో  కామెరూన్లో నివాసం ఉంటున్నాడు. నాలుగు రోజుల కిందట వీరికి ఓ పాప పుట్టింది. అయితే భార్యపై అనుమానం పెంచుకున్న అతగాడు పుట్టిన పాపకు తాను తండ్రిని కాదంటూ భార్యతో వాగ్వాదానికి దిగాడు.

అంతేకాకుండా  ఆవేశంతో రెచ్చిపోయిన  అలెగ్జాండర్ ఫోర్బా భార్యపై దాడికి దిగాడు. ఆ ప్రయత్నంలో కన్న కూతురనే దయ లేకుండా మానవత్వం మరచి ప్రవర్తించాడు. భార్యను కొట్టడానికి ఆ పాపనే ఓ ఆయుధంగా చేసుకున్నాడు.  భార్యను కొట్టేందుకు పాపను కర్రలా ఉపయోగించుకోవటమే కాకుండా ఆ పసికందును అలాగే పై అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. అంతటితో ఆగని అలెగ్జాండర్ చుట్టుపక్కల వాళ్లు చూసేవరకూ భార్యపై దాడి చేయడం విశేషం.

భర్త నుంచి తప్పించుకున్న ఆమె... గాయపడిన పాపను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వెళ్లగా, అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా అలెగ్జాండర్పై పోలీసులు హత్య, దాడి కేసులు  నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వచ్చేవారం నిందితుడిని ప్రిటోరియా కోర్టులో హాజర పరచనున్నారు. కోర్టు అతగాడికి శిక్ష విధించినా బిడ్డను కోల్పోయిన కన్నతల్లి ఆవేదన మాత్రం వర్ణనాతీతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement