వయసు పెరిగే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టి చివరకు మరణించడం చాలా సహజం.
ఒకసారి పనిచేయడం ఆగిపోయాక.. కణాల్లోని భాగాలను నాశనం చేసేందుకు ఆటోఫేగీ అనే ఓ ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ చిన్నతనంలో ఆరోగ్యం, శరీరధారుడ్యానికి తోడ్పడితే.. వయసు పెరిగే కొద్దీ వార్ధక్య లక్షణాలను ప్రోత్సహిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆటోఫేగీని నిలిపేయడం ద్వారా వయసు మీరిన కీటకాల్లో వార్ధక్య లక్షణాలతోపాటు నాడీ సంబంధిత సమస్యలు కూడా తగ్గినట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని ఈ పరిశోధనల్లో పాలుపం చుకున్న శాస్త్రవేత్త జోనాథన్ బైర్న్ చెబుతున్నారు.