ఏకాకిలా చనిపోయింది... | loneliest bird nigel died | Sakshi
Sakshi News home page

ఏకాకిలా చనిపోయింది...

Feb 7 2018 8:32 PM | Updated on Feb 7 2018 8:32 PM

loneliest bird nigel died - Sakshi

ఒంటరి పక్షిగా పేరొందిన నైజిల్‌

వెల్లింగ్‌టన్‌, న్యూజిలాండ్‌ : న్యూజిలాండ్‌ ద్వీపానికి సమీపంలోని మానా ఐలాండ్‌లో అటవీ జంతువులను ఆకర్షించేందుకు పర్యావరణవేత్తలు సముద్ర తీరం వెంబడి కాంక్రీటుతో గనెట్‌ పక్షులను తయారు చేసి పెట్టారు. తన జాతి పక్షుల బొమ్మలకు ఆకర్షణ చెందిన నైజిల్‌ అనే పక్షి వాటితో పాటు జీవించడం ప్రారంభించింది. కాంక్రీటు బొమ్మలతో స్నేహం చేయాలని ప్రయత్నించింది.

అక్కడే నివసించేందుకు గూడును కూడా ఏర్పాటు చేసుకుంది. జంతు సంపద లేని ద్వీపంలో ఒంటరినని గుర్తెరుగక కాంక్రీటు పక్షులతో జీవనం సాగించింది నైజిల్‌. కాంక్రీటు పక్షులతో జీవనం సాగిస్తున్న నైజిల్‌ న్యూజిలాండ్‌లో ఫేమస్‌ అయిపోయింది. క్రమంగా వారు దాని ‘లోన్లీ బర్డ్‌’  అని పిలుచుకోవడం ప్రారంభించారు. ఏమైందో ఏమో గత జనవరి నెల ఆఖరులో నైజిల్‌ ప్రాణాలు విడిచింది.

నైజిల్‌ గురించి మాట్లాడిన పర్యావరణవేత్త బెల్‌.. దాని ప్రవర్తన ఆ జాతిలోని ఇతర పక్షులకు భిన్నం ఉండేదని చెప్పారు. మానా ద్వీపాన్ని తన ఇల్లుగా నైజిల్‌ భావించినట్లు తెలిపారు. అందుకే అవకాశమున్నా ఎగిరి వెళ్లిపోలేదని అన్నారు. ఉన్నట్లుండి నైజిల్‌ మరణించడం బాధ కలిగించినట్లు చెప్పారు. అది వయసు మళ్లీ మరణించిందా? లేక ఒంటరితనమే మరణానికి కారణమా? అనే విషయం తెలియాల్సివుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement