లండన్‌లో తొలి నగ్న రెస్టారెంట్! | Londons first nude restaurant to be called The Bunyadi | Sakshi
Sakshi News home page

లండన్‌లో తొలి నగ్న రెస్టారెంట్!

Jun 10 2016 3:07 AM | Updated on Sep 4 2017 2:05 AM

లండన్‌లో తొలి నగ్న రెస్టారెంట్!

లండన్‌లో తొలి నగ్న రెస్టారెంట్!

బాహ్య ప్రపంచపు కట్టుబాట్లను కాసేపు పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా రెస్టారెంట్‌లో గడపాలనుకునే వారికి స్వర్గధామంలాంటి...

లండన్: బాహ్య ప్రపంచపు కట్టుబాట్లను కాసేపు పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా రెస్టారెంట్‌లో గడపాలనుకునే వారికి స్వర్గధామంలాంటి రెస్టారెంట్ ఒకటి లండన్‌లో ప్రారంభానికి సిద్ధమైంది. ‘ది బునియాది(పునాది)గా పిలిచే ఈ రెస్టారెంట్‌లో తప్పదనుకుంటే పొదుపుగా దుస్తులను వేసుకున్న వారికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాఖాహార, మాంసాహార వంటలను మట్టికుండల్లో, ‘తినగల’ చెంచాలతో వడ్డిస్తారు. ఈ చెంచాలను ఆహారపదార్ధాలతో తయారుచేస్తారు. రసాయనాలులేని వంటలు ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. ఇప్పటికే రెస్టారెంట్‌కు వెయిటింగ్ లిస్ట్ ఏకంగా 44,200కు చేరింది.

రెస్టారెంట్‌లో ఒకేసారి కేవలం 42 మంది మాత్రమే కూర్చునే సదుపాయం ఉంది. విద్యుత్, ఫోన్, దుస్తులు ఇలా ఎలాంటివి లేని ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసం ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పినట్లు రెస్టారెంట్ మాతృసంస్థ అయిన ‘లాలీపాప్’ వ్యవస్థాపకుడు సెబ్ లేయాల్ ప్రకటించారు. శనివారం ప్రారంభంకానున్న ఈ రెస్టారెంట్‌లో పూర్తి నగ్నంగా ఉండే కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కొవ్వొత్తుల కాంతుల్లో.. వెదురుకర్రలతో చేసిన ఏర్పాట్లు రెస్టారెంట్‌కు కొత్త శోభను తెస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement