రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి టాలీవుడ్లో పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెగ టాక్ వినిపించింది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇటీవలే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకుని ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' అంటూ 1.31 నిమిషాల ఆడియో గ్లింప్స్ వదిలారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం సందీప్ రెడ్డి వంగా బిగ్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్తో బోల్డ్ డైరెక్టర్గా ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి.. ప్రభాస్ స్పిరిట్లోనూ అదే పంథాను ఫాలో అవుతున్నట్లు అర్థమవుతోంది. అందుకే స్పిరిట్లోనూ బోల్డ్ సన్నివేశాలు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ ఓ సీన్లో నగ్నంగా కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.
గ్లింప్స్ డైలాగ్ వల్లే రూమర్స్..
ఇటీవల విడుదలైన గ్లింప్స్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్.. ఈ వార్తకు బలం చేకూరుతోంది. ఖైదీని బట్టలూడదీసి టెస్టులకు పంపండి అనే చెప్పిన డైలాగ్తోనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ సినిమాలో నగ్నంగా కనిపించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా యానిమల్లో రణ్బీర్ కపూర్ ఓ సీన్లో న్యూడ్గా కనిపించారు. అదే పంథాను స్పిరిట్ విషయంలో ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే స్టార్ హీరోలతో బోల్డ్ సీన్స్ చేయించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమని చెప్పొచ్చు. కాగా.. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.


