మార్స్‌పై రంగురాళ్లు.. అసలు రంగు ఇదే..

Large Blue Substances Appear On MARS Are Originally Grey Colour - Sakshi

వాషింగ్టన్‌ : అరుణ గ్రహం ‘మార్స్‌’పై ఇటీవల విచిత్ర రాళ్ల ఆచూకీని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అయితే తాజాగా నాసా శాస్త్రవేత్తలు మార్స్‌పై అతిపెద్ద నీలి రంగు రాయిని గుర్తించారు. నాసా స్పేస్‌క్రాఫ్ట్‌లో పంపిన అత్యంత సామర్థ్యం కలిగిన హిరైస్‌ కెమెరాలు నీలి రంగు రాళ్లను ఫొటోలు తీసి పంపించాయి. అయితే వాస్తవానికి ఆ రాయి నీలిరంగులో లేదని, బూడిద రంగులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

సాధారణ కెమెరాల్లో అయితే కనీసం ఆ రాయి రంగు కూడా కనిపించేది కాదని, అయితే హిరైస్‌ పవర్‌ఫుల్‌ కెమెరా కావడంతో రాయిని ఫొటో తీసింది. కొన్ని గంటలపాటు శ్రమించి పరిశీలించిన అనంతరం మార్స్‌ మీద
ఉన్న రాళ్ల అసలు రంగు గుర్తించగలుగుతున్నామని.. అందుకు అక్కడి వాతావరణం కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనాలో గ్రహాలు ఫొటోలశాఖ డైరెక్టర్‌ అల్‌ఫ్రెడ్‌ మెక్‌ఎవెన్‌ చెబుతున్నారు. ఆకుపచ్చ, ఎరుపు,
నీలరం రంగుల్లో కనిపించిన రాళ్లను ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీతో అడ్జస్ట్‌ చేయగా బూడిద రంగు పదార్థాలున్నట్లు వెల్లడించారు. నీలం రంగు రాళ్లు, వస్తువులను మాత్రమే కెమెరా ఎందుకు బంధిస్తుందో, ఆ దిశగా పరిశోధన చేయనున్నట్లు మెక్‌ఎవెన్‌ వివరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top