వయస్సు 50 తర్వాత అయితే...!

Lack Of Physical Relationship In Couples Leads To Health Problems - Sakshi

న్యూఢిల్లీ : యాభై ఏళ్లు దాటిన ఆలు మగల మధ్య లేదా స్త్రీ, పురుషుల మధ్య సెక్స్‌ అంతంత మాత్రంగానే ఉంటుందని తెల్సిందే. కొందరి మధ్య అంతంత మాత్రమే కాదు, అస్సలు ఉండకపోవచ్చు. 50 ఏళ్లు దాటిని పురుషుడికి సరైన సెక్స్‌ లేకపోతే మూడింట రెండు వంతులు జబ్బున పడే అవకాశం ఉందట. అలాగే 50 ఏళ్లు దాటిన మహిళలకు లేకపోతే వ్యాధి గ్రస్తులయ్యే అవకాశం 64 శాతం ఉందట. 50 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు సెక్స్‌లో పాల్గొంటే వారిలో 85 కాలరీలు కరగిపోతాయని, ఆనందాన్ని కలిగించే ఎండార్పిన్స్‌ విడుదలవుతాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. సెక్స్‌లేని మగవాళ్లకు 64 శాతం క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని, 41 శాతం దీర్ఘకాలిక జబ్బు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. నపుంసకులైన మగవాళ్లలో వాస్కులర్‌ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉందని డాక్టర్‌ లీ స్మిత్‌ తెలిపారు.

ఆంగ్లిన్‌ రష్కిన్‌ యూనివర్శిటీ అధ్యయన బందం 5,700 స్త్రీ, పురుషులపై జరిపిన అధ్యయనం వివరాలను డాక్టర్‌ లీ స్మిత్‌ మీడియాకు వెల్లడించారు. సెక్స్‌తో సహా అన్ని వ్యాయామాలు ఆరోగ్యానికి మంచివేనని ఆయన చెప్పారు. సెక్స్‌లో పాల్గొనని వారిలో మధుమేహం, కీళ్ల నొప్పులు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు. 50 ఏళ్లు పైబడిన స్త్రీ, పురుషుల మధ్య సెక్స్‌ ఏ మేరకు తగ్గుతూ వస్తుందో, ఆ మేరకు వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్‌ లీ స్మిత్‌ చెప్పారు. ఈ వయస్కుల వారిలో సెక్స్‌ తగ్గినట్లయితే వారు ఏదో జబ్బుకు గురైనట్లు భావించవచ్చా? ప్రశ్నకు వారీ అధ్యయనంలో ఎలాంటి వివరణా పేర్కొనలేదు. ‘ఆర్కీవ్స్‌ ఆఫ్‌ సెక్సువల్‌ బిహేవియర్‌’ అనే పత్రికలో ఈ సెక్స్‌ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ప్రచురించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top