బర్త్‌డే రోజు బాయ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్! | Kylie Jenner celebrates Tyga birthday | Sakshi
Sakshi News home page

బర్త్‌డే రోజు బాయ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్!

Nov 19 2016 10:53 AM | Updated on Oct 22 2018 6:05 PM

బర్త్‌డే రోజు బాయ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్! - Sakshi

బర్త్‌డే రోజు బాయ్‌ఫ్రెండ్‌కు సర్‌ప్రైజ్!

మోడల్ కైలీ జెన్నర్ తన సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది.

లండన్: మోడల్ కైలీ జెన్నర్ తన సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. నేడు(శనివారం) తన ప్రియుడు టైగ 27వ పుట్టినరోజు వేడుకలను నిర్వహంచాలని జెన్నర్ ప్లాన్ చేసింది. ఇటీవల హాట్ ఫొటోలతో తరచుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే ఈ మోడల్ మరో ఫ్రెండ్ కింగ్ కైరోతో కలిసి టైగ బర్త్‌డేను సెలబ్రేట్ చేసింది. టైగ పుట్టినరోజు వేడుకలను ఎలా సెలబ్రేట్ చేసిందో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోతో పాటు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో జెన్నర్, టైగ, కింగ్ కైరోతో పాటు మరో వ్యక్తి కనిపిస్తారు. ఆమె ఇంటి కిచెన్‌లో మొత్తం బెలూన్లతో నిండిపోయింది. టైగ వచ్చి డోర్ తెరవగానే.. జెన్నర్ సహా అక్కడున్న వారు 'హ్యాపీ బర్త్‌డే' అంటూ సాంగ్ పాడి విషెస్ చెప్పారు. ఆ తర్వాత జెన్నర్ తన ప్రియుడు టైగకు అతడి కుమారుడు గిమ్మీ తయారుచేసిన ఓ పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చింది. జెన్నర్ ఇచ్చిన సడన్ సర్‌ప్రైజ్‌తో టైగ ఎంతో సంతోషించాడు. గిఫ్ట్ తయారుచేసిన గిమ్మీని అభినందించాడు. ఆపై జెన్నర్ ఇచ్చిన పార్టీని అందరూ ఎంజాయ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement