breaking news
Tyga
-
బర్త్‌డే రోజు బాయ్‌ఫ్రెండ్‌కు సర్ప్రైజ్!
లండన్: మోడల్ కైలీ జెన్నర్ తన సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. నేడు(శనివారం) తన ప్రియుడు టైగ 27వ పుట్టినరోజు వేడుకలను నిర్వహంచాలని జెన్నర్ ప్లాన్ చేసింది. ఇటీవల హాట్ ఫొటోలతో తరచుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఈ మోడల్ మరో ఫ్రెండ్ కింగ్ కైరోతో కలిసి టైగ బర్త్‌డేను సెలబ్రేట్ చేసింది. టైగ పుట్టినరోజు వేడుకలను ఎలా సెలబ్రేట్ చేసిందో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోతో పాటు కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ వీడియోలో జెన్నర్, టైగ, కింగ్ కైరోతో పాటు మరో వ్యక్తి కనిపిస్తారు. ఆమె ఇంటి కిచెన్‌లో మొత్తం బెలూన్లతో నిండిపోయింది. టైగ వచ్చి డోర్ తెరవగానే.. జెన్నర్ సహా అక్కడున్న వారు 'హ్యాపీ బర్త్‌డే' అంటూ సాంగ్ పాడి విషెస్ చెప్పారు. ఆ తర్వాత జెన్నర్ తన ప్రియుడు టైగకు అతడి కుమారుడు గిమ్మీ తయారుచేసిన ఓ పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చింది. జెన్నర్ ఇచ్చిన సడన్ సర్ప్రైజ్తో టైగ ఎంతో సంతోషించాడు. గిఫ్ట్ తయారుచేసిన గిమ్మీని అభినందించాడు. ఆపై జెన్నర్ ఇచ్చిన పార్టీని అందరూ ఎంజాయ్ చేశారు. -
బ్రేకప్ తర్వాతే చాలా బాగున్నాడట!
లాస్ ఏంజిల్స్: ప్రేమ విఫలమైతే ఎవరైనా విషాదంలో మునిగిపోతారు. విరహంతో రగిలిపోతారు. కానీ హాలీవుడ్ ర్యాపర్ టైగా (26) మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్ కిలీ జెన్నర్‌తో బ్రేకప్ అయ్యాకే చాలా బాగున్నాడట. రియాల్టీ టీవీ షో నటి అయిన కిలీ (18)తో రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు టైగా. ఈ ఇద్దరూ మీడియా ముందు తెగ ప్రేమించేసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రేమబాష్యాలు రాసుకున్నారు. అప్పుడప్పుడు దూరంగా ఉన్నా నిన్నమొన్నటి వరకు చాలా ప్రణయ సల్లాపాలు సాగించారు. ఈ ఇద్దరికీ ఈ మధ్య బ్రేకప్ అయింది. మరీ బ్రేకప్ అయిన తర్వాత 'మీరెలా ఉన్నారు' అని మీడియా ప్రశ్నించగా.. 'నాకేం చాలా బాగా ఉన్నాను. ఎప్పటిలాగే మరింత కష్టపడేందుకు ప్రయత్నిస్తున్నాను. మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి, గొప్ప వాటిని సాధించడానికి కృషి చేస్తున్నాను' అని చెప్పాడు. అటు కిలీ మాత్రం తమ బ్రేకప్ గురించి ఇంతవరకు పబ్లిగ్గా స్పందించలేదు. ప్రస్తుతం తల్లి క్రిస్ జెన్నర్ ఇంట్లో ఉన్నానని, మరికొన్ని రోజులూ ఇక్కడే ఉంటానని ఈ భామ 'స్నాప్‌చాట్' వీడియోస్‌లో తెలిపింది. బ్రేకప్‌తో ఈమె తిరిగి సొంతింటికి వెళ్లిపోయినట్టు చెప్తున్నారు. గతంలో ఇతర అమ్మాయిలతో సాగించిన ప్రేమ సల్లాపాలపై అబద్ధాలు చెప్పడం, విశ్వసనీయంగా ఉండకపోవడంతో టైగాతో కిలీ తెగదెంపులు చేసుకుందట. గతంలో వీరు ఒకసారి బ్రేకప్ చేసుకున్నప్పిటికీ మళ్లీ కలిసిపోయారు. ఈసారి మాత్రం అలా కలిసే చాన్సే లేదంటున్నారు సన్నిహితులు.