బ్రేకప్‌ తర్వాతే చాలా బాగున్నాడట! | Tyga is good after Kylie Jenner split | Sakshi
Sakshi News home page

బ్రేకప్‌ తర్వాతే చాలా బాగున్నాడట!

May 14 2016 11:24 AM | Updated on Sep 4 2017 12:06 AM

బ్రేకప్‌ తర్వాతే చాలా బాగున్నాడట!

బ్రేకప్‌ తర్వాతే చాలా బాగున్నాడట!

ప్రేమ విఫలమైతే ఎవరైనా విషాదంలో మునిగిపోతారు.

లాస్‌ ఏంజిల్స్‌: ప్రేమ విఫలమైతే ఎవరైనా విషాదంలో మునిగిపోతారు. విరహంతో రగిలిపోతారు. కానీ హాలీవుడ్ ర్యాపర్‌ టైగా (26) మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్ కిలీ జెన్నర్‌తో బ్రేకప్‌ అయ్యాకే చాలా బాగున్నాడట. రియాల్టీ టీవీ షో నటి అయిన కిలీ (18)తో రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు టైగా. ఈ ఇద్దరూ మీడియా ముందు తెగ ప్రేమించేసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రేమబాష్యాలు రాసుకున్నారు. అప్పుడప్పుడు దూరంగా ఉన్నా నిన్నమొన్నటి వరకు చాలా ప్రణయ సల్లాపాలు సాగించారు. ఈ ఇద్దరికీ ఈ మధ్య బ్రేకప్‌ అయింది. మరీ బ్రేకప్ అయిన తర్వాత 'మీరెలా ఉన్నారు' అని మీడియా ప్రశ్నించగా.. 'నాకేం చాలా బాగా ఉన్నాను. ఎప్పటిలాగే మరింత కష్టపడేందుకు ప్రయత్నిస్తున్నాను. మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి, గొప్ప వాటిని సాధించడానికి కృషి చేస్తున్నాను' అని చెప్పాడు.

అటు కిలీ మాత్రం తమ బ్రేకప్ గురించి ఇంతవరకు పబ్లిగ్గా స్పందించలేదు. ప్రస్తుతం తల్లి క్రిస్ జెన్నర్‌ ఇంట్లో ఉన్నానని, మరికొన్ని రోజులూ ఇక్కడే ఉంటానని ఈ భామ 'స్నాప్‌చాట్‌' వీడియోస్‌లో తెలిపింది. బ్రేకప్‌తో ఈమె తిరిగి సొంతింటికి వెళ్లిపోయినట్టు చెప్తున్నారు. గతంలో ఇతర అమ్మాయిలతో సాగించిన ప్రేమ సల్లాపాలపై అబద్ధాలు చెప్పడం, విశ్వసనీయంగా ఉండకపోవడంతో టైగాతో కిలీ తెగదెంపులు చేసుకుందట. గతంలో వీరు ఒకసారి బ్రేకప్ చేసుకున్నప్పిటికీ మళ్లీ కలిసిపోయారు. ఈసారి మాత్రం అలా కలిసే చాన్సే లేదంటున్నారు సన్నిహితులు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement