కరోనా కట్టడి : ఇదీ అసలైన కర్ఫ్యూ

Kuwait Announced Imposing Nationwide Curfew - Sakshi

కువైట్‌ సిటీ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కఠిన చర్యలును తీసుకుంటున్నాయి. చైనా, ఇటలీ, ఇరాన్‌ వంటి దేశాలు ఇప్పటికే తీవ్ర ఆంక్షలను విధించాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కువైట్‌ కూడా అనేక జాగ్రత్త చర్యలను చేపడుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆదివారం నాటికి 176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కువైట్‌లో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం 4 గంటలు వరకు ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని ఆ దేశ అధికారులు తెలిపారు. దీంతో కువైట్‌లో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఏ ఒక్కరూ రోడ్లపై తిరగకుండా స్వచ్చందంగా నిర్బంధాన్ని పాటిస్తున్నారు. (కరోనా అలర్ట్‌ : మూడో దశకు సిద్ధమవ్వండి!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top