అమెరికా ఏజీ జెఫ్‌ సెషన్స్‌కు ఉద్వాసన

Jeff Sessions Is Forced Out as Attorney General as Trump Installs Loyalist - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అటార్నీ జనరల్‌(ఏజీ) జెఫ్‌ సెషన్స్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్థానంలో తన మద్దతుదారైన మేథ్యూ వైట్కర్‌ను తాత్కాలిక ఏజీగా నియమించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణను పర్యవేక్షించేందుకు జెఫ్‌ సెషన్స్‌ నిరాకరించిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం విచారణ ప్రక్రియ ట్రంప్‌ చేతుల్లోకి వచ్చేసినట్లైంది. కాగా, ఇన్నాళ్లూ జెఫ్‌ అందించిన సేవలకు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌ విజ్ఞప్తి మేరకే తాను ఏజీ పదవికి రాజీనామా చేసినట్లు జెఫ్‌ ప్రకటించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top