కోట్లు గెలిచి.. ముఖానికి మాస్క్‌తో వచ్చి! | Jamaican Lottery Winner Hide Her Face With Mask | Sakshi
Sakshi News home page

లాటరీ గెలిచి.. ముఖానికి మాస్క్‌తో వచ్చి!

Jun 9 2018 12:01 PM | Updated on Jun 9 2018 12:21 PM

Jamaican Lottery Winner Hide Her Face With Mask - Sakshi

కింగ్‌స్టన్‌ : కష్టాల్లో ఉన్నవారికి ఎవరైనా చిన్నసాయం చేస్తేనే సంతోషిస్తారు. అలాంటిది ఓ మహిళకు ఏకంగా 180 మిలియన్ల జమైకన్‌ డాలర్ల లాటరీ ప్రైజ్‌మనీని(భారత కరెన్సీలో సుమారుగా 9.44 కోట్ల రూపాయాలు) నెగ్గారు. అయితే లాటరీ నెగ్గడం కంటే కూడా ఆ నగదు తీసుకోవడానికి వచ్చిన తీరే చూపరులను ఆకర్షించింది. ఆ వివరాలిలా.. ఎన్‌ గ్రే అనే జమైకా మహిళ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో సూపర్‌ లొట్టో లాటరీ టికెట్‌ కొన్నారు. ఆమె పంట పండింది. తాజాగా తీసిన లాటరీ డ్రాలో ఎన్‌. గ్రే విజేతగా నిలిచారని ప్రకటించగా.. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

లాటరీ ప్రైజ్‌మనీని తీసుకునే కార్యక్రమానికి ముఖానికి మాస్క్‌తో ఆ మహిళ వచ్చారు. తాను ఆ నగదులో కొంత భాగం తన అప్పులకు వెచ్చించగా, మరికొంత పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఖర్చు చేస్తానన్నారు. యువత కోసం, తన సామాజిక వర్గం కోసం కమ్యూనిటీ సెంటర్లను నిర్మించి సేవలు అందిస్తానని చెప్పారు. తన ఉనికిని అందరికీ తెలియజెప్పడం ఇష్టం లేని కారణంగా మాస్క్‌ ధరించినట్లు లాటరీ విజేత తెలిపారు.  

ముఖానికి మాస్క్‌ ధరించడంపై నెటిజన్లు స్పందించారు. ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా ఆమె సాధారణంగా ఉండాలని భావించడం సరైన నిర్ణయమని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇతరులు ఎలాగైతో ఆలోచిస్తారో.. అదే విధంగా తాను ఎవరన్నది తెలియకుండా ఆ మహిళ తెలివైన పని చేశారని మరికొందరు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement