స్కూల్‌ బస్సు హైజాక్‌.. ఆపై నిప్పు

Italian driver hijacks and torches school bus full of children - Sakshi

ఇటలీలో దారుణం

విద్యార్థులను రక్షించిన పోలీసులు

రోమ్‌: ఇటలీలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్‌ 51 మంది పిల్లలున్న బస్సును హైజాక్‌ చేసి బస్సుతోపాటు వాళ్లందరినీ తగులబెట్టాలని చూశాడు. అదృష్టవశాత్తూ పోలీసులకు సమాచారం అంది వారు వచ్చి మంటల్లో చిక్కుకున్న పిల్లలందర్నీ రక్షించగలిగారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీలోకి వలస వస్తున్న వారిపై ఇటలీ ఉప ప్రధానుల వైఖరికి నిరసనగా ఈ పని చేసినట్లు ఆ డ్రైవర్‌ చెప్పాడు.

‘మధ్యధరా సముద్రంలో ఎంతో మంది చనిపోతున్నారనీ, ఈ రోజు మీరు∙చావబోతున్నారు’ అని అతను విద్యార్థులతో అన్నాడు. 51 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది ఓ క్రీడా వేదికకు వెళ్లొస్తుండగా డ్రైవర్‌ ఈ హైజాక్‌కు పాల్పడ్డాడు. 30 నిమిషాలపాటు వారిని తన బందీలుగా ఉంచుకున్నాడు. వెంట తెచ్చిన పెట్రోల్‌ను బస్‌పై పోసి నిప్పంటించాడు. ఓ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హైజాక్‌ విషయం చెప్పడం, వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్వరమే పోలీసులు అక్కడకు చేరుకుని, బస్సు అద్దాలు పగులగొట్టి అందరినీ రక్షించారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top