ఇర్మా ఎఫెక్ట్‌.. వాల్ట్‌ డిస్నీవరల్డ్‌ మూత | Irma forces Disney World to close | Sakshi
Sakshi News home page

ఇర్మా ఎఫెక్ట్‌.. వాల్ట్‌ డిస్నీవరల్డ్‌ మూత

Sep 11 2017 8:23 PM | Updated on Aug 24 2018 8:18 PM

ఇర్మా ఎఫెక్ట్‌.. వాల్ట్‌ డిస్నీవరల్డ్‌ మూత - Sakshi

ఇర్మా ఎఫెక్ట్‌.. వాల్ట్‌ డిస్నీవరల్డ్‌ మూత

అమెరికాలో విధ్వంసం సృష్టిస్తున్న హరికేన్‌ ఇర్మా సెగ ఫ్లోరిడాలోని వాల్ట్‌ డిస్నీవరల్డ్‌ రిసార్ట్‌కు కూడ తగిలింది.

ఫ్లోరిడా: అమెరికాలో విధ్వంసం సృష్టిస్తున్న హరికేన్‌ ఇర్మా సెగ ఫ్లోరిడాలోని వాల్ట్‌ డిస్నీవరల్డ్‌ రిసార్ట్‌కు కూడ తగిలింది. ఇర్మా తుఫాను ప్రభావంతో వాల్ట్‌ డిస్నీవరల్డ్‌ రిసార్ట్‌ రెండు రోజులు మూసివేశారు. దీంతో టికెట్లు బుక్‌ చేసుకున్న ఔత్సాహికులకు రిసార్టు అధికారులు డబ్బుల తిరిగిచ్చేశారు. అయితే కొన్ని థర్డ్‌ పార్టీ కంపెనీలు మాత్రం డబ్బులు తిరిగివ్వలేదు. 
 
గత 45 ఏళ్ల చరిత్రలో డిస్నీవరల్డ్‌ మూతబడటం ఇది ఆరోసారి మాత్రమే. భద్రతా కారణాల దృష్ట్యా రిస్టార్ట్‌ను ఆది, సోమవారం మూసివేస్తున్నట్లు, తిరిగి మంగళవారం తెరుస్తామని రిసార్ట్‌ అధికారులు పేర్కొన్నారు.  ఇక గత అక్టోబర్‌లో కూడా హరికేన్‌ మాథ్యూ దెబ్బకు ఈ రిసార్ట్‌ గేట్లు మూతబడ్డాయి.  సౌత్‌వెస్ట్‌ ఓర్లాండోలో 25వేల ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈ రిసార్ట్‌లో మ్యాజిక్‌ కింగ్‌డమ్‌, ఈపికాట్‌, యానిమల్‌ కింగ్‌డమ్‌, హలీవుడ్‌ స్టూడియోలతో నాలుగు మెయిన్‌థీమ్‌ పార్కులున్నాయి.
 
ఇంకా వాటర్‌ పార్క్‌లు, హోటల్స్‌, ఈఎస్‌పీఎన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లున్నాయి.  థీమ్‌డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అసోసియేషన్‌ గతేడాది రిపోర్టు ప్రకారం మ్యాజిక్‌ కింగ్‌డమ్‌ పార్కు ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందినది. 2016లో ఈ పార్కును 20 మిలియన్ల మంది సందర్శించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఇక రిసార్ట్‌ ఉద్యోగుల సంఖ్య 73,000.  డిస్నీవరల్డే డిస్నీ కంపెనీకి ముఖ్యమైన రెవెన్యూ ఆధారం. హరికేన్‌ ఇర్మా డిస్నీకి తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement