భారతీయుడికి జైలు శిక్ష | Indian Sentenced To 5 Years In UAE Prison For 'Spying': Report | Sakshi
Sakshi News home page

భారతీయుడికి జైలు శిక్ష

Jan 11 2016 10:46 AM | Updated on Sep 3 2017 3:29 PM

భారతీయుడికి జైలు శిక్ష

భారతీయుడికి జైలు శిక్ష

గూఢచర్యం కేసులో దోషిగా భారతీయుడొకరికి యూఏఈ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడిని మనార్ అబ్బాస్ గా గుర్తించారు.

అబుదాబి: గూఢచర్యం కేసులో దోషిగా భారతీయుడొకరికి యూఏఈ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడిని మనార్ అబ్బాస్ గా గుర్తించారు. భారత నిఘా విభాగం తరపున గూఢచారిగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు రుజువుకావడంతో అతడికి అబుదాబిలోని సుప్రీంకోర్టు ఐదేళ్ల శిక్ష విధించిందని 'గల్ఫ్ న్యూస్‌' తెలిపింది.

అబుబాబి నౌకాశ్రయాల్లో సైనిక జలాంతర్గాములకు చెందిన కీలక సమాచారాన్ని అబుదాబిలోని భారత దౌత్యకార్యాలయానికి చేరవేస్తున్నారనే ఆరోపణలతో గతేడాది అబ్బాస్ ను అరెస్ట్ చేశారు. జైలు శిక్ష పూర్తైన తర్వాత అతడిని స్వదేశానికి పంపిస్తారు. అబ్బాస్ కు జైలు శిక్ష విధించడంపై భారత ఎంబసీ ఇంకా స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement