హెలికాప్టర్‌ రెక్క తగిలి భక్తుడి మృతి

Indian Pilgrim Dies After Being Hit by Rear Blade of Helicopter - Sakshi

కఠ్మాండు: మానస సరోవర యాత్రకు వెళ్లిన ముంబైకి చెందిన భక్తుడు మంగళవారం ప్రమాదవశాత్తూ హెలికాప్టర్‌ వెనుక ఉండే ఫ్యాన్‌ రెక్క తగిలి నేపాల్‌లో మరణించారు. ఫ్యాన్‌ రెక్క తగలడంతో ఆయన తల తెగి ఘటన స్థలంలోనే చనిపోయారని భారత రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు.

హిల్సా ప్రాంతంలో హెలిప్యాడ్‌ వద్ద ఉన్న హెలికాప్టర్‌ను ఎక్కేందుకు ఆయన వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుణ్ని కార్తీక్‌ నాగేంద్ర కుమార్‌ మెహతా (42)గా గుర్తించామనీ, సిమికోట్‌లో పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top