ఆఫ్రికన్ల కోసం భారతీయ యువ పారిశ్రామికవేత్త రాహుల్ కాల్రా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
ఘనా: ఆఫ్రికన్ల కోసం భారతీయ యువ పారిశ్రామికవేత్త రాహుల్ కాల్రా ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 2025 నాటికి ఆఫ్రికన్లలో ఎక్కువ మంది ఆన్‌లైన్ షాపింగ్ ద్వారానే కొనుగోళ్లు చేస్తారని తాను బలంగా నమ్ముతున్నానని, అందుకే ప్రత్యేకించి ఆఫ్రికన్ల కోసం ఈ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నానని కాల్రా తెలిపారు. Africakart.comపేరుతో ప్రారంభించిన ఈ పోర్టల్ ద్వారా అన్నిరకాల వస్తువులను కొనుగోలు చేసుకునే వీలుందన్నారు.
మూడేళ్ల కిందట ఘనాకు వెళ్లిన రాహుల్.. తండ్రి రాజ్ కాల్రాతో కలిసి అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆఫ్రికన్లకు ఆన్‌లైన్ విక్రయాలు అంతగా అందుబాటులో లేవు. దీంతో ప్రత్యేకించి ఆఫ్రికన్ల కోసమే ఓ పోర్టల్‌ను ప్రారంభించడం ద్వారా ఆన్‌లైన్ షాపింగ్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో Africakart.comను ప్రారంభించాడు.