అమెరికా ఎన్‌ఏఈలో నలుగురు భారతీయ-అమెరికన్లకు చోటు | Indian-Americans in the US NAE | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్‌ఏఈలో నలుగురు భారతీయ-అమెరికన్లకు చోటు

Feb 11 2016 1:18 AM | Updated on Apr 3 2019 4:38 PM

అమెరికా నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్(ఎన్‌ఏఈ)కు నలుగురు భారతీయ-అమెరికన్లు ఎంపికయ్యారు.

వాషింగ్టన్: అమెరికా నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్(ఎన్‌ఏఈ)కు నలుగురు భారతీయ-అమెరికన్లు ఎంపికయ్యారు. సామాజిక సేవ చేసినందుకు ఎంపిక చేసిన 80 మంది జాబితాలో.. అనిల్ కె జైన్, డాక్టర్ ఆర్తీ ప్రభాకర్, గణేశ్‌ఠాకూర్, డాక్టర్ కె.ఆర్.శ్రీధర్‌లకు చోటు దక్కింది. జైన్..మిచిగన్ స్టేట్ టీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ప్రభాకర్.. వర్జీనియాలోని యూఎస్ డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్స్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డెరైక్టర్. గణేశ్‌ఠాకూర్.. హూస్టన్‌లో గల ఠాకూర్ సర్వీసెస్ ఇన్‌కార్పొరేషన్ అధ్యక్షుడు. శ్రీధర్.. కాలిఫోర్నియాలోని బ్లూమ్ ఎనర్జీ కార్పొరేషన్ ముఖ్య సహ వ్యవస్థాపకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement