భారతీయురాలికి బంగారు కత్తెర

Indian-American emerges as key figure in Trump's deregulation efforts - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో కాలంచెల్లిన నియంత్రణల రద్దులో కీలక పాత్ర పోషించిన ఇండో–అమెరికన్‌ నయోమి జహంగీర్‌ రావ్‌కు తగిన గుర్తింపు లభించింది. శ్వేతసౌధంలో  జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్‌ ఆమెకు బంగారు కత్తెరను  బహూకరించారు. 1960ల నాటి, ప్రస్తుత నియంత్రణలను కలిగిన ప్రతులను చుట్టిన రెడ్‌ టేప్‌(కఠిన నియంత్రణలకు సూచిక)ను ట్రంప్‌ ఈ కత్తెరతోనే కత్తిరించి రావ్‌కు అందించారు. 2017 జూలై 18 నుంచి శ్వేతసౌధ సమాచార, నియంత్రణ  వ్యవహారాల హెడ్‌గా వ్యవహరిస్తున్న రావ్‌ పాత నిబంధనలు, నియంత్రణల తొలగింపుకు కృషిచేశారు. ట్రంప్‌ ప్రతి కొత్త నియంత్రణకు 22 పాత వాటిని ఎత్తివేశారు. సంస్కరణలతో సుమారు రూ.51925 కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top