పాస్‌పోర్టులు జారీ చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు.
షిల్లాంగ్: పాస్‌పోర్టులు జారీ చేస్తున్న ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. షిల్లాంగ్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించేందుకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్‌తో కలసి శుక్రవారం ఆమె ఇక్కడికి వచ్చారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సకాలంలో ల్యాండ్ కాకపోవడంతో షిల్లాంగ్ పాస్‌పోర్టు కేంద్రాన్ని మేఘాలయ సీఎం ముకుల్ సంగ్మా ప్రారంభించారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన సుష్మా ప్రసంగాన్ని అధికారులు వినిపించారు.