అమెరికా సరిహద్దు దాటిన వలసదారులు | Immigrants entry mexico Border | Sakshi
Sakshi News home page

అమెరికా సరిహద్దు దాటిన వలసదారులు

Nov 16 2018 4:12 AM | Updated on Apr 4 2019 3:25 PM

Immigrants entry mexico Border - Sakshi

తిజువానా(మెక్సికో): సెంట్రల్‌ అమెరికా నుంచి బయల్దేరిన వలసదారుల తొలి బృందం అమెరికా సరిహద్దు చేరుకుంది. కాలిఫోర్నియాతో సరిహద్దు పంచుకుంటున్న మెక్సికోలోని తిజువానాలో కంచె దాటిన 9 మందిని అమెరికా నిఘా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తల్లి, నలుగురు పిల్లలు, 19 ఏళ్ల గర్భిణి ఉన్నారు. భద్రతా సిబ్బంది చూస్తుండగానే కంచె దాటి అమెరికా వైపు వెళ్లిన మరికొందరు ఆ వెంటనే వెనక్కి వచ్చారు. సుమారు 4 వేల మందితో కూడిన ప్రధాన బృందం కూడా త్వరలోనే ఇక్కడకి చేరుకునే అవకాశం ఉంది. స్వదేశంలో హింస, పేదరికానికి తాళలేక హొండూరస్, గ్వాటెమాల, ఎల్‌సాల్వడార్‌ దేశాల ప్రజలు అమెరికాలో ఆశ్రయం పొందడానికి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement