'బ్రేకప్ నుంచి బయటపడలేదు' | I'm still broken: Nick Cannon on divorce with Mariah Carey | Sakshi
Sakshi News home page

'బ్రేకప్ నుంచి బయటపడలేదు'

Aug 22 2016 9:00 AM | Updated on Sep 4 2017 10:24 AM

'బ్రేకప్ నుంచి బయటపడలేదు'

'బ్రేకప్ నుంచి బయటపడలేదు'

తన భార్యతో విడిపోయిన బాధలో నుంచి తాను ఇంకా తేరుకోలేదని ప్రముఖ నటుడు, కమెడీయన్ నిక్ కెనాన్ అన్నాడు.

లాస్ ఎంజెల్స్: తన భార్యతో విడిపోయిన బాధలో నుంచి తాను ఇంకా తేరుకోలేదని ప్రముఖ నటుడు, కమెడీయన్ నిక్ కెనాన్ అన్నాడు. అది నిజంగా తన గుండెను తొలిచివేసిన ఘటన అని ఆయన చెప్పారు. ఇప్పటికి ఇప్పట్లో తాను మరో కొత్త సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా లేనని చెప్పాడు. కెనాన్ మనసుపడి ప్రముఖ గాయని మారియా క్యారీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు.

వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. వారికి ట్విన్స్ కూడా. అయితే, ఇటీవలె ఆమె కెనాన్ తో బ్రేకప్ చేసుకొని ఆస్ట్రేలియాకు చెందిన బిలియనీర్ జేమ్స్ పార్కర్ తో ఉంటోంది. అతడితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ 'నేను ఇప్పుడు కొత్త రిలేషన్ పెట్టుకునేందుకు సిద్ధంగా లేను. ప్రతి రోజు నేను క్యారీతో తెగ మాట్లాడేవాడిని. కానీ ఈ రోజు ఒంటరిగా ఉండిపోయాను' అని ఆయన చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement